నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులో చెత్త డంపింగ్ యార్డు పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెత్త డంపింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని సిబ్బందికి సూచించారు.