పేదల జీవితాల్లో వెలుగులు నిండిన రోజునే ఎమ్మెల్యేగా విజయవంతమైనట్లు భావిస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నరసరావుపేట పట్టణంలోని 11, 32, 33, 34 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి, నరసరావుపేట మండలం ములకలూరు, ఇస్సాపాలెం గ్రామాలలో లబ్దిదారులకు పెన్షన్ అందించారు.