రొంపిచర్ల మండలం అలవాల గ్రామం నందు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు పాల్గొని అలవాల గ్రామంలో పర్యటించారు. ప్రజల నుండి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను గ్రామంలోని ప్రజలకు వివరించారు. పార్టీ నాయకులతో పలు సమస్యల పై చర్చించారు.