నరసరావుపేటలోని ఓ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిపై ఆర్థిక మోసం కేసు నమోదు చేశామని వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ తెలిపారు. సోమవారం వేలూరి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండి పుల్లారావుపై వారి భాగస్వాములపై కేసులు రిజిస్టర్ చేసామన్నారు. చిట్ ఫండ్ పాలసీల్లో నిధులు చెల్లించిన నిర్వాహకులు చిట్టీల వేలం నిర్వహించకుండా సేకరించిన మొత్తాన్ని దుర్వినియోగం చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని ఫిర్యాదు చేశారు.