చిట్ ఫండ్ బాధితులు నరసరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్నారు. రావిపాడు రోడ్డు నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.