నరసరావుపేట: ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచండి: కలెక్టర్

75చూసినవారు
మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్పకొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో నరసరావుపేటలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్