నరసరావుపేట నియోజకవర్గం శ్యాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి మరియు త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్ల గురించి చర్చించారు. ప్రతిష్టాత్మకంగా జరిపే కోటప్పకొండకు సమకూర్చవలసిన నిధులను కేటాయించవలసిందిగా కోరారు.