విలేజ్ హెల్త్ క్లినిక్ లో గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఆర్థిక వేతనం పెంచాలని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం నరసరావుపేట పట్టణంలో నిరసన దీక్ష 20 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఆరు సంవత్సరాలు దాటితే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.