నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో రోడ్డు ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కమిషనర్ జస్వంత్ స్పష్టం చేశారు. శుక్రవారం వినుకొండ రోడ్డులో ఆక్రమణలను జెసిబితో పూర్తిగా తొలగించారు. గతంలో నోటీసులు ద్వారా మైక్ ద్వారా ఎన్నోసార్లు స్వచ్ఛందంగా ఆక్రమణదారులకు హెచ్చరికలు చేయడం జరిగిందన్నారు. ఆక్రమణలు తొలగించిన తరువాత తిరిగి ముందుకు రావడం, షాపులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.