నరసరావుపేట పట్టణ టు టౌన్ పరిధిలోని టూ టౌన్ సీఐ హైమారావు, ఎస్సై అశోక్ శనివారం వాహనాలు తనిఖీలు చేశారు. అనంతరం నడిపే డ్రైవర్లకు ఆల్కహాల్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు. ఆటోలో పరిమితి నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు. కాబట్టి వాహనదారులందరూ గమనించాలని కోరారు.