ప్రభుత్వ ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం నుంచి పి - 4 ప్రణాళికపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.