నరసారావుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబరు 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎన్. సత్య శ్రీ గురువారం ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించనున్నట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్, మోటారు వాహన ప్రమాద కేసులతో పాటు ఇతర కేసులు పరిష్కరిస్తారని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.