నూజెండ్ల: విద్యార్థులతో డీఈఓ ముఖాముఖి

65చూసినవారు
నూజెండ్ల: విద్యార్థులతో డీఈఓ ముఖాముఖి
పల్నాడు జిల్లా డీఈఓ చంద్రకళ నూజెండ్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న అకాడమిక్ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవిచంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్