పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని శనివారం జిల్లా ఇంటర్ ఎడ్యుకేషనల్ అధికారి లీలావతి తెలిపారు. ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై నరసరావుపేట అధ్యాపకులకు జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 11, 509ల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వేణు చెప్పారు.