పల్నాడు: నేటి నుంచి కబడ్డి పోటీలు

63చూసినవారు
పల్నాడు: నేటి నుంచి కబడ్డి పోటీలు
కమ్యూనిస్టు యోధుడు పుచ్చల పల్లి సుందరయ్య 1959, 60 సంవత్సరాల్లో వడ్డాని అయ్యన్న (తూర్పు మాలపల్లి) ఇంటి వద్ద జెండాను ఆవిష్కరించారని, దానికి గుర్తుగా ఇక్కడ ప్రతిఏటా సుంద రయ్య వర్ధంతితోపాటు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.లూథర్‌, ఎస్‌.బాబు శుక్రవారం తెలి పారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా వచ్చే సోమ వారం సభతోపాటు జెండావిష్కరణ ఉంటుంద న్నారు. ఇందులో భాగంగా శని, ఆది, సోమవారాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను చంద్రమౌళి పార్క్‌లో నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు బహుమ తులను 19న పిల్లి అంకమ్మ చౌక్‌ వద్ద నిర్వహించే సభలో ప్రదానం చేస్తామని, పోటీల్లో పాల్గొనే జట్టు రూ.300 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్