పల్నాడు జిల్లాకు డీసీహెచ్ఎస్ గా నియమితులైన డాక్టర్ ఎం. ప్రసూన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఉద్యోగులు ఆమెకు అభి నందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ అరుణ్బాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.