ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి కృషి చేయాలని, ఈ దిశగా జనసైనికులు సంసిద్ధం కావాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు. బుధవారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజల చెంతకు చేర్చటానికి కృషి చేస్తున్నారని వారు అన్నారు.