నరసరావుపేట పట్టణంలో జాతీయ జండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 100 అడుగుల జాతి జండాతో పట్టణంలో ర్యాలీ చేశారు.