పల్నాడులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్

58చూసినవారు
పల్నాడులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్లలో శనివారం శ్రమదానం జరిగింది. పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ, పరిశుభ్రత ఆరోగ్యకర సమాజానికి దోహదపడుతుందని, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్