మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయని ఆ వాటిని వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమావేశం స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం మున్సిపల్ శాఖ అధ్యక్షులు ఓ. కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు.