కోటప్పకొండ వద్ద నిర్వహించే జాతర ఏర్పాట్లపై అధికారులకు, అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా మంచినీటి కోసం చెరువులు నింపుకోలేదన్నారు. కొండకు వచ్చే రోడ్డు మార్గాలు సిద్ధం చేయలేదన్నారు. వీఐపీలకు బస్సులు ఏర్పాటు గురించి క్లారిటీ లేదన్నారు. ఘాట్ రోడ్డులో ఏర్పాట్లు సక్రమంగా లేవన్నారు.