వాసవి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి పూజలు

75చూసినవారు
రొంపిచర్లలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. అమ్మవారికి జరిగిన కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త రామచంద్రరావు కమిటీ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు. అనంతం భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్