ఫర్టిలిటీ సంరక్షణపై అవగాహన మరియు సమర్థవంతమైన చికిత్సలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసేందుకు ఒయాసిస్ ఫర్టిలిటీ యొక్క 'జననీ యాత్ర' నేడు గుంటూరులో ఉచిత క్యాంప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీకి కృతజ్ఞతలు అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదలపై హెచ్చరికలు చేస్తున్న సందర్భంలో ఈ యాత్ర ఒక ప్రధాన పరిష్కార మార్గమన్నారు. ఇటీవల, మన రాష్ట్రంలో పుట్టుబాటు రేటు 1.7కి తగ్గిందన్నారు. ఇది భవిష్యత్తులో సామాజిక-ఆర్థిక సవాళ్లను తీసుకువస్తుందన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఫర్టిలిటీ సమస్యలను సమయానికి గుర్తించడం, సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, వైద్య సహాయం అవసరమన్నారు. ఈ క్యాంప్‌లు ఆ అవసరాన్ని తీరుస్తాయన్నారు. ఇన్‌ఫర్టిలిటీని ఒక సామాజిక స్టిగ్మాగా కాకుండా వైద్యపరమైన సవాలుగా చూడాలన్నారు. ఈ యాత్ర ద్వారా అనేక కుటుంబాలకు ఆశ కలుగుతుందని నమ్ముతున్నానన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, ఒయాసిస్ ఫెర్టిలిటీకి అభినందనలు అని తెలిపారు.
సైంటిఫిక్ హెడ్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ టైర్-2, 3 పట్టణాలలో అవగాహన లోపం ఆలస్య చికిత్సకు దారితీస్తుందన్నారు.జననీ యాత్ర ద్వారా,ప్రత్యేక సంరక్షణను ప్రజల ద్వారానే తీసుకువస్తున్నామన్నారు. ఇది చికిత్స మాత్రమే కాదు, జంటల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయాణం అని గుర్తు చేశారు.
క్లినికల్ హెడ్ డాక్టర్ రమ్య మాట్లాడుతూ సంతానలేమి ఇప్పుడు కేవలం వైద్య సమస్య కాదని,జీవనశైలి సవాళ్లు కూడా దీనికి కారణమన్నారు. సత్వర నిర్ధారణ, నిపుణుల సలహాలతో ప్రతి జంట వద్దకు సేవలు చేరవేస్తున్నామన్నారు." సంతానలేమిని ఇకపై రహస్యంగా పెట్టుకోకూడదని ప్రతి జంటకు సమయానికి నిపుణుల మార్గదర్శకత్వం అవసరమన్నారు. ఈ క్యాంప్‌ల ద్వారా తాము జంటలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అవుతూ, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామన్నారు. సమాజంలోని అపోహలను సైన్స్ ద్వారా తొలగిస్తున్నామని,
ముందున్న ప్రణాళికలు
జూన్ 2025 లోపు రెండు రాష్ట్రాల్లో 30 జిల్లాలను తాకేలా ఈ యాత్రను విస్తరిస్తున్నామన్నారు. ప్రతి క్యాంప్‌లో సురక్షితమైన శాంపిల్ కలెక్షన్, డిజిటల్ డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నామన్నారు. "ఆలస్యం చేయకండి – సమయానికి అవగాహన, చర్యలే జంటల సంతాన సాఫల్యానికి మూలాలు" అని ఒయాసిస్ ఫర్టిలిటీ ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.
ఒయాసిస్ ఫర్టిలిటీ గురించి
2009లో స్థాపించబడిన ఈ సంస్థ, భారతదేశంలో 19 నగరాల్లో 31 కేంద్రాలతో 1,00,000+ శిశువుల జననంలో పాత్ర పోషించింది. ఐవీఎఫ్, ఐయూఐ వంటి అధునాతన చికిత్సలతో పాటు సమగ్ర ఫర్టిలిటీ సేవలను అందిస్తుంది.