75త్యాళ్ళూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎండిఎం ప్రారంభం

70చూసినవారు
75త్యాళ్ళూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎండిఎం ప్రారంభం
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్ ప్లస్ లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన‌ పథకాన్ని శనివారం లాంఛనంగా‌ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎండిఎంను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ టి.సత్యనారాయణ, ఎస్ఎంసి చైర్మన్ పున్నారావు, హెచ్.ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్