రాజధాని అమరావతి మహానగర విస్తరణలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రెండో విడతలో 44 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తామని గురువారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పినట్లుగా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. అమరావతి మండల పరిధిలో 12 గ్రామాలను ఎంపిక చేసి, నాలుగింటిలో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.