అమరావతి మండలంలోని శ్రీఅమరేశ్వరస్వామి దేవస్థానం కార్యాలయంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి సమీక్ష సమావేశం ఈవో కే. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీవో రమణకాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని భద్రతా ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, పూజా కార్యక్రమాల నిర్వహణపై సమగ్రంగా చర్చించారు. ఆర్డీవో మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.