మండలంలోని లగడపాడులో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవాలయంలో స్వామివారి తృతీయ కళ్యాణ మహోత్సవం మంగళవారం జరిగింది. ఆలయ ధర్మకర్త అనుముల వెంకట్రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు చల్లపల్లి సత్యం పెద్ద శ్రేష్టి బండారు వెంకటేశ్వర్లు, బండారు నాగరాజు అనుముల రామారావు పుట్టా వెంకట్రామయ్య సహకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానానికి చిల్లాపల్లి సత్యం సహకరించారు.