విద్యార్థిని, విద్యార్థులకు మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజేతలకు డిక్షనరీలు బహుమతులుగా గురువారం పంపిణీ చేశారు. పెదకూరపాడు మండలంలోని గారపాడు, తాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలలో గెలుపొందిన వారికి మాగులూరి ఫౌండేషన్ నిర్వాహకులు మాగులూరి కృష్ణారావు, కుంచనపల్లి కిరణ్, కొండవీటి ప్రసాదు, భాష్యం శివ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.