ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి: పిడిఎఫ్

83చూసినవారు
ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి: పిడిఎఫ్
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని అమరావతి మేజర్ కు ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలని పెదకూరపాడు అభివృద్ధి వేదిక (పిడిఎఫ్) కన్వీనర్ దర్శి శేషారావు కోరారు. శుక్రవారం పెదకూరపాడు తహశీల్దార్ ధనలక్ష్మికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ మేజర్, మైనర్ కాలువల కింద మిరప, పొగాకు వేశారన్నారు. ఎం మస్తాన్రావు, బి రవి కిరణ్, ఎం. నరసింహారావు, వై. నరేంద్ర, వి శ్రీనివాసరావు, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్