అమరావతి మండలం ఉంగుటూరులో శనివారం రెండవ విడత అమరావతి రాజధాని భూ సేకరణపై జరిగిన గ్రామ సభలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి రైతుల అనుమానాలను నివృత్తి చేసి, భూ సేకరణ విధానాలు, పరిహారం, అభివృద్ధి ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి రైతుల సహకారం కీలకమని, అమరావతి నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.