వ్యాధుల నిర్ధారణ పట్ల మెరుగైన స్క్రీనింగ్ చేయాలని ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ స్వర్ణ రాజేశ్వరి సూచించారు. గురువారం పెదకూరపాడు, తాళ్లూరులో ఆమె పర్యటించారు. అసంక్రమిత వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వెలుగొండ రెడ్డి, ఆదిత్య, సూపర్వైజర్ దిలీపు, సిహెచ్ అనుపమ, ఏఎన్ఎం రాణి, గ్రేసమ్మ పాల్గొన్నారు.