పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళచెరువు సమీపంలో మంగళవారం ట్రాక్టర్ గొర్రు తగిలి స్కూల్ పిల్లల ఆటో బోల్తా కొట్టింది. 3వ తరగతి చదువుతున్న అనన్యకు చెయ్యి విరగడంతో పాటు ఆటోలోని 12 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.