పిడుగురాళ్ల పట్టణంలోని దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ చివరి శుక్రవారం సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. అమ్మవారికి మహిళలు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదాలను అందజేశారు.