పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ మధుసూదనరావు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతము పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులు రాహు కేతు పూజలలో పాల్గొన్నారు. శ్రీ స్వామి వారి శేషవస్త్రముతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి గోగినేని లీలా కుమార్ తెలిపారు.