నేల వాలిన ట్రాన్స్ఫార్మర్.. పట్టించుకోని అధికారులు

1033చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిలో గత రెండు రోజుల నుండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయి నేల వాలింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రహదారి ప్రయాణం చేసే గ్రామీణులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏ క్షణాన మంటలు చెలరేగి మీద పడతాయోనని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్