గుంటూరు జిల్లా పెదకాకాని హైవే పై సోమవారం రాత్రి రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ ఎదురు ఆపి ఉన్న ఆటోను విజయవాడ వెళుతున్న కారు అతివేగంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులను, క్షతగాత్రులను గుంటూరు జి జి హెచ్ కి తరలించారు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.