వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను బుధవారం గుంటూరు జిజిహెచ్ లో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శించారు. వైసిపి గుండాల కు ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. గాయపడిన కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బూర్ల హామీ ఇచ్చారు. పలువురు తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.