రేపల్లె ఓల్డ్ టౌన్ నేతాజీ అప్పర్ ప్రైమరీ పాఠశాల 1995 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పోస్టాఫీస్ సందులోని దేవి మినీ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులు రవి, శంకరావులను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, కిరణ్, విజయలక్ష్మి, ఉషారాణి పాల్గొన్నారు.