విద్యుత్ లైన్ల నిర్వహణ నిమిత్తం రేపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఏఈ శివనాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని ఏకలవ్య బొమ్మ సెంటర్, రాజశ్రీ ఒక్క పొడి ఏరియా, డొంక రోడ్డు, పళ్ళ మార్కెట్ వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.