గ్రామాలలోని సంపద తయారు కేంద్రంల షేడ్ల వద్ద వున్న చెత్త నుంచి సంపద సృష్టించాలని ఈఓపీఆర్డీ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీవో కాశయ్య సూచనలను అనుసరించి నకరికల్లు మండలంలోని దేచవరం, రూపెనగుంట్ల, తురకపాలెం గ్రామాల్లోని ఎస్ డబ్ల్యూ పీసీ షెడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు ఇచ్చారు.