భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను పల్నాడు జిల్లా నకరికల్లులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పిడిఎం నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలు చదవడానికి వీలు లేదు అన్న అసమానతలు సమాజంలో బలంగా ఉన్న రోజుల్లో పోరాడి మహిళల విద్యకు కృషి చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని నాయకులు కొనియాడారు.