తమ భూములు ఆక్రమించారంటూ బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్ పాలెం ఎస్టీ కాలనీ వాసులు శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు 25 కుటుంబాలకు కేటాయించిన 75 ఎకరాల భూములు గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని అన్నారు. తమ భూములు తిరిగి తమకి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.