నకరికల్లు గ్రామాలలోని సంపద తయారు కేంద్రాల షేడ్ల వద్ద ఉన్న చెత్త నుంచి వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేయటం ప్రారంభించాలని ఈఓపిర్ డి శివ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులకు గురువారం సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ కాసయ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సంపదను పెంచుకునేందుకు వార్మి కంపోస్టు ఎరువులను తయారు చేయాలన్నారు.