నకరికల్లు మండలంలోని శ్రీరాంపురం వద్ద గల బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్లో ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ బసప్ప (40) మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికితీశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్య శాలకు తరలించినట్లు నకరికల్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.