నకరికల్లు మండల పరిధిలో రైతులు తమ అన్ని పంటలకు సంబంధించి ఈ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అతివృష్టి, అనావృష్టి వలన పంటలు దెబ్బ తిన్నప్పుడు ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ సహాయం అందుతుందని తెలిపారు. అలాగే రైతులు ఈకేవైసి కూడా చేసుకోవాలన్నారు. ఈ పంటకు చివరి అవకాశం ఫిబ్రవరి 15 తేదీ వరకు ఉందన్నారు.