ఆంధ్రప్రదేశ్ రాజధాని తాడేపల్లిలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంకి చెందిన అంజి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ షేక్ మాబు పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ కాసాని వీరేష్ విచ్చేసి ఎంపికైన వారికి పత్రాలు అందజేశారు.