సత్తెనపల్లిలో శుక్రవారం జరిగిన సంఘటనలో, బస్సు ఢీకొనడంతో 80 సంవత్సరాల వృద్ధుడి కాళ్లపైకి టైర్లు ఎక్కడంతో తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికుల సమాచారం ప్రకారం, వృద్ధుడు పెద్ద పిచ్చయ్యగా గుర్తించారు. హయర్ బస్సు ఆర్టీసీ బస్టాండ్లోకి రావడంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని అన్నారు. వెంటనే, 108 ద్వారా ఆయనను ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.