సత్తెనపల్లిలో ఎక్సైజ్ శాఖ సీఐ విజయ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు గీత కులాలకు సంబంధించిన మద్యం షాపులకు నిర్వహించవలసి ఉన్న లాటరీ ప్రక్రియ వాయిదా వేశారన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు తదుపరి లాటరీ జరుగు తేదీ ప్రకటించ బడుతుందని మద్యం షాపులకు అప్లికేషన్ దాఖలు చేసే వారు రేపు లాటరీ ప్రక్రియకు హాజరు కానవసరం లేదన్నారు.