ఇంటింటికీ నీటిని అందించేందుకు చేపట్టిన జలజీవన్ పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్ అండ్ బి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జల జీవన్ మిషన్ నిధుల వినియోగంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రక్షిత పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.