అయినవోలులో కిషోర బాలికల కోసం అవగాహన సమావేశం

52చూసినవారు
అయినవోలులో కిషోర బాలికల కోసం అవగాహన సమావేశం
తుళ్లూరు మండలం అయినవోలు గ్రామంలో గురువారం కిషోర బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యంపై అవగాహన సమావేశం జరిగింది. అంగన్వాడీ సూపర్వైజర్ సీతారావమ్మ తల్లిదండ్రులకు పిల్లలకు సెల్‌ఫోన్ వినియోగం, చదువు, ఇంటిపనుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. బాలికల భవిష్యత్తు మెరుగైనదిగా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. గ్రామ పంచాయితీ, మహిళా సంఘాలు, తల్లిదండ్రులు, బాలికలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్